Chocolate Ganesh: తియ్యతియ్యని చాక్లెట్ గణపతి.. తయారు చేయడానికి ఎంత ఖర్చయ్యిందంటే..?

వినాయక చవితి వచ్చిందంటే చాలు విగ్రహాలు అనేక రూపాల్లో తయారు చేస్తారు

Update: 2023-09-18 03:30 GMT

దిశ,వెబ్ డెస్క్: వినాయక చవితి వచ్చిందంటే చాలు విగ్రహాలు అనేక రూపాల్లో తయారు చేస్తారు. ఇప్పటి వరకు మనం మట్టితో చేసిన గణేషుడి విగ్రహాలను చూసాము. చాక్లెట్స్ మాత్రమే ఉపయోగిస్తూ ఈ భక్తుడు బొజ్జ గణపయ్య ను చాక్లెట్స్ తో నింపేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న నాగతేజ ప్రతీ ఏడాది పర్యావరణానికి హాని కలగకుండా ఆలోచనలకు పదును పెట్టి కొత్త కొత్తగా వినాయకుడి విగ్రహాలను తయారు చేస్తూ ఉంటాడు. దానిలో భాగంగానే ఈ ఏడాది కూడా వైరైటీగా గణేషుడి విగ్రహం తయారు చేసాడు. చిన్న పిల్లలకు ఇష్టమైన చాక్లెట్లతో వినాయకుడిని తయారు చేసి మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. వినాయకుడిని అనేక రకాల చాక్లెట్లతో తయారు చేశామని.. విగ్రహం తయారు చేయటానికి ఇరవై వేల రూపాయలు ఖర్చయ్యిందని, నిమజ్జనం రోజున చాక్లెట్లను భక్తులకు పంచుతామని అతను తెలిపాడు.  


Similar News