Home Minister Anitha: ప్రసాదాన్ని కల్తీ చేసినోళ్లకు పుట్టగతులుండవు: హోంమంత్రి అనిత ఫైర్

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో భాగస్వాములైన వారికి పుట్టగతులుండవని హోంమంత్రి అనిత (Home Minister Anitha) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-23 08:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో భాగస్వాములైన వారికి పుట్టగతులుండవని హోంమంత్రి అనిత (Home Minister Anitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ (సోమవారం) ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఎంతో ప్రాధాన్యత ఉందని తెలిపారు. భక్తుల మనోభవాలను దెబ్బతీస్తూ.. కల్తీ నెయ్యిని వాడి తిరుమల క్షేత్రాన్ని గత ప్రభుత్వం మలినం చేసిందని మండిపడ్డారు. ఇష్టానుసారంగా ఆర్జిత సేవల రేట్లను పెంచి దేవుడితో కూడా వ్యాపారం చేశారని ఆరోపించారు. ఇక ఐదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన వైసీపీ సర్కార్ (YCP Government) రూ.లక్షల కోట్ల అప్పులు చేసి సామాన్యుల మీద ఆ భారాన్ని మోపిందని పైర్ అయ్యారు. ఐదేళ్లు రాష్ట్రానికి రాజధాని ఏదో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితి అందరికీ కల్పించారని ధ్వజమెత్తారు. ఏది ఏమైనా శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షిస్తామని అనిత అన్నారు.


Similar News