‘కల్కీ’ టికెట్ల ధరల వివాదం.. నిర్మాత అశ్వినీదత్‌కు నోటీసులు

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కీ’ సినిమా టికెట్ ధరల పెంపు ప్రస్తుతం వివాదస్పదమైంది....

Update: 2024-07-03 16:18 GMT

దిశ, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కీ’ సినిమా టికెట్ ధరల పెంపు ప్రస్తుతం వివాదస్పదమైంది. ఈ మూవీకి ఏపీలో 10 రోజులు టికెట్ల రేట్లు పెంచుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే మరో నాలుగు రోజు పాటు టికెట్ల రేట్లు పెంచడంపై ఓ పిటిషనర్ హైకోర్టుకు వెళ్లారు. టికెట్ల రేట్ల పెంపుపై స్టే ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం...ఏ సినిమాకైనా ప్రత్యేకంగా టికెట్ ధర పెంచే అధికారం ప్రభుత్వానికి ఉందా లేదా అనేదానిపై హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ‘కల్కీ’ మూవీ నిర్మాత అశ్వినీదత్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

కాగా ‘కల్కీ’ మూవీ జూన్ 27న విడుదలై విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రభుత్వం ఏపీలో 10 రోజుల పాటు టికెట్ల రేటు పెంచే అవకాశం కల్పించింది. దీంతో పెంచిన ధరలతోనే ప్రేక్షకులు టికెట్లు కొనుగోలు చేసి సినిమాను వీక్షిస్తున్నారు. ఇప్పటికే వారం పూర్తి చేసుకుని 10 రోజులవైపు వెళ్తుండటంతో మరో నాలుగు రోజులు టికెట్ల రేట్లు కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో  అత్యంతరాలు వ్యక్తమయ్యాయి. మరో నాలుగు రోజులు పాటు టికెట్ ధర పంపును సవాల్ చేస్తూ పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. టికెట్ ధరల పెంపుపై స్టే ఇవ్వాలని కోరారు. 


Similar News