Cyclone Fengal:నేడు, రేపు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో ఆకస్మిక వరదలు!

ఫెంగల్ తుపాన్(Fengal Typhoon) తీరం దాటడంతో తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి.

Update: 2024-12-01 01:59 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఫెంగల్ తుపాన్(Fengal Typhoon) తీరం దాటడంతో తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. ఈ తుపాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు రైతులు విలవిల్లాడుతున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు పంటకు అపార నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వానలు వీడడం లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే సెప్టెంబర్ నెలలో ఏపీని వరదలు, భారీ వర్షాలు వణికించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరోసారి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నేడు(ఆదివారం), రేపు(సోమవారం) నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు(Flash floods) వచ్చే అవకాశం ఉందన్నారు. గంటకు 90 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని సూచించారు. దీంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ క్రమంలో రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

Tags:    

Similar News