Heavy Rains:తునిలో భారీ వర్షం..జలమయమైన పల్లపు ప్రాంతాలు

కాకినాడ జిల్లా తునిలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండగా ఉన్నప్పటికీ ఒక్కసారిగా వాతావరణం మారింది.

Update: 2024-09-06 09:44 GMT

దిశ, తుని:కాకినాడ జిల్లా తునిలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండగా ఉన్నప్పటికీ ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. పలుచోట్ల భారీ శబ్దాలతో పిడుగులు పడ్డాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భారీ వర్షంతో పట్టణంలోని బాలాజీ రోడ్డు, మార్కండ్రాజు పేట, శాంతి నగర్ లోని ప్రధాన రహదారులు చెరువుల్లా మారాయి. మరోవైపు రైల్వే అండర్ పాస్ వద్ద బురద పేరుకుపోవడంతో దుర్వాసన వస్తుంది. దీంతో అటుగా వెళ్ళే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.


Similar News