దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతం (Bay of Bengal)లో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా (Srikakulam District)లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్థం అవుతోంది. అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయం కావడంతో రాకపోకలు కూడా నిలిచిపోయాయి. 7వ తేదీ శనివారం మొదలైన మధ్యాహ్నం ప్రారంభమైన వర్షం ఈ రోజు (ఆదివారం) మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. దీంతో ఇప్పటికే వాతావరణ శాఖ శ్రీకాకుళానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాయుగుండం శ్రీకాకుళం జిల్లాకి 350 కిలోమీటర్ దూరంలో ఉందని, దాని ప్రభావం వల్ల శ్రీకాకుళం (Srikakulam), విజయనగరం (Viziayanagaram), విశాఖపట్నం (Visakhapatnam) జిల్లాల్లో ఆది, సోమవారాల్లో 150 నుంచి 200 మి.మి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Metiorological Department) హెచ్చరికలు జారీ చేసింది.
ఈ క్రమంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంతాల్లో నివసిస్తున్న మత్స్యకారులు 3 రోజుల వరకు చేపల వేటకు వెళ్లొద్దని ఆదేశించింది. మరోవైపు జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు పొంగే పరిస్థితి నెలకొంది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. నాగావళి (Nagavali), వంశధార (Vamsadhara) నదులు కూడా పొంగే ప్రమాదం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జిల్లాలోని విద్యా సంస్థలకు సోమవారం సెలవు సెలవు ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.