Heavy Rains:ఏపీలో భారీ వర్షాలు..హోం మంత్రి కీలక ఆదేశాలు

ఏపీలో రెండు రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.

Update: 2024-07-20 11:24 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో రెండు రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి, హోం మంత్రి వంగలపూడి అనిత అధికారులతో నేడు(శనివారం) సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో హోం మంత్రి అనిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడారు. వర్షాల ప్రభావం, తాజా పరిస్థితులపై మంత్రి ఆరా తీశారు. అల్లూరి జిల్లాలో ఏడు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. అల్లూరి జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి మేరకు వరద ప్రాంతాల్లో ఎన్‌డీఆర్‌ఎప్ బలగాలు రంగంలోకి దిగాయి. ఆహారం, వైద్య సదుపాయాలు, మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని అధికారులను ఆమె ఆదేశించారు.

Read More..

Tirumala: శ్రీవారిని దర్శించుకున్న హోంమంత్రి.. 

Tags:    

Similar News