Breaking: పాడేరు ఏజెన్సీ అతలాకుతలం..30 గ్రామాలకు రాకపోకలు బంద్

అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది..

Update: 2024-07-20 03:39 GMT

దిశ, వెబ్ డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పాడేరు ఏజెన్సీలో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. రాయిగడ్డ వంతెన వద్ద ఉన్న వాగు ఒక్కసారిగా పొంగింది. దీంతో వంతెన‌పై నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ ఎఫెక్ట్‌తో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. హుకుంపేట మండలం తడిగిరిలో వాగు ఉగ్రరూపం దాల్చింది. దీంతో 10 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. పెదబయలు మండలంలో కించవాగు ఉధృతిగా ప్రవహిస్తోంది. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షాలు మరో రెండు రోజులు పాటు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సేవల కోసం 08935 293120, 293448కు ఫోన్ చేయాలని సూచించారు.

అటు ఏలూరు జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. వేలేరుపాడులో 12 మండలాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. వర్షం దెబ్బకు పూరిళ్లు కొట్టుకుపోయాయి. వేరుశనగ, జామాయిల్ పంటలు నీట మునిగాయి. దీంతో తీవ్ర నష్టం వాటిల్లింది. 

Tags:    

Similar News