ఆయన నాకు అన్యయ్యే కాదు..! చిరంజీవి యూకే పార్లమెంట్ అవార్డ్ అందుకోవడంపై పవన్ కళ్యాణ్

పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవికి యూకే పార్లమెంట్ ప్రతిష్టాత్మకమైన జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించింది.

Update: 2025-03-20 05:23 GMT
ఆయన నాకు అన్యయ్యే కాదు..! చిరంజీవి యూకే పార్లమెంట్ అవార్డ్ అందుకోవడంపై పవన్ కళ్యాణ్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవికి (Megastar Chiranjeevi) యూకే పార్లమెంట్ (UK Parliament) ప్రతిష్టాత్మకమైన జీవిత సాఫల్య పురస్కారాన్ని (Life Time Acheavement Award) అందించింది. దీనిపై ఆయన తమ్ముడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. చిరంజీవికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా.. ఆయన తమ్ముడిగా పుట్టినందుకు ఎప్పుడూ గర్విస్తునే ఉంటానని అన్నారు. యునైటెడ్ కింగ్ డం పార్లమెంట్ అందించిన జీవిత సాఫల్య పురస్కారం అన్నయ్య కీర్తిని మరింత పెంచనుందని పవన్ తెలిపారు.

అలాగే సాధారణ మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా జీవితం మొదలుపెట్టి, స్వశక్తితో, కళామతల్లి దీవెనలతో, చిత్ర రంగంలో మెగాస్టార్ గా ఎదిగి, నాలుగున్నర దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తూ, తన నటనతో ఉత్తమ నటుడిగా 9 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు అందుకుని, నటనకు పర్యాయపదంగా నిలిచిన వ్యక్తి చిరంజీవి అని కొనియాడారు. అంతేగాక ఆయన తమ్ముడిగా పుట్టినందుకు ఎప్పుడూ గర్విస్తూనే ఉంటానని, తాను చిరంజీవి ని ఒక అన్నయ్యగా కంటే ఒక తండ్రి సమానుడిగా భావిస్తానని చెప్పారు. తాను జీవితంలో ఏం చేయాలో తెలియక, అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో నాకు మార్గం చూపించిన వ్యక్తి ఆయనేనని, నా జీవితానికి హీరో అన్నయ్య చిరంజీవి అని తెలిపారు. తన సేవా భావంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం ద్వారా ఆపదలో ఉన్నవారికి రక్తదానం, నేత్రదానం అందిస్తూ, నన్నే కాకుండా కోట్లాదిమంది అభిమానులను సమాజ సేవకులుగా మార్చిన స్ఫూర్తి ప్రదాత మా అన్నయ్య కొణిదల చిరంజీవి అని అన్నారు.

ఇక తాను ఎదగడమే కాకుండా తన కుటుంబంతో పాటుగా, ఎంతోమంది ఎదుగుదలకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయ సహకారాలు అందిస్తూ, టాలెంట్ ఉన్న ఎవరైనా సరే ఏ రంగంలో అయినా సరే రాణించవచ్చు అనేందుకు ఉదాహరణగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన సమాజానికి అందించిన సేవలకు గాను ఇటీవలే భారత ప్రభుత్వం రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ చేతుల మీదుగా అందుకున్నారని, మళ్లీ యూకే పార్లమెంట్ చిరంజీవి కి, ఈనెల 19న జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించిన వార్త నాకెంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ.. భవిష్యత్తులో ఆయన మరిన్ని పురస్కారాలు అందుకుని మా అందరికీ మార్గదర్శిగా ఉండాలని కోరుకున్నారు. ఈ పురస్కార కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న స్టాక్ పోర్ట్ ఎంపీ నవేందు మిశ్రాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Read More..

కొంచెం జ్ఞానం ఉంటే ఆ తేడా కనిపిస్తుంది ప్రతి ఒక్కరు ఆ పని చేయాలంటూ రాజమౌళి పోస్ట్.. ఎవరిని ఉద్దేశించంటే?  

MegaStar Chiranjeevi: లండన్ చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి.. రేపే ఆ పురస్కారంతో సన్మానం?  

Tags:    

Similar News