ప్రేమ పేరుతో వేధింపులు.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

ఇంటర్ చదువుతున్న విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధించాడు. తనను ప్రేమించాలని వెంటపడ్డాడు.

Update: 2023-11-15 06:35 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఇంటర్ చదువుతున్న విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధించాడు. తనను ప్రేమించాలని వెంటపడ్డాడు. తనకు అలాంటి ఉద్దేశం లేదని ఆ విద్యార్థి చెప్పింది. అయినా అతడి ప్రవర్తనలో మార్పురాలేదు. దీంతో తల్లిదండ్రులకు తెలియజేసింది. తల్లిదండ్రులు మందలించారు. ఇక వేధించడం మానేస్తాడనుకుంటే అతడి వేధింపులు మరింత తీవ్రమయ్యాయి. దీంతో ఆ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన ఏపీలోని విశాఖపట్నంలో జరిగింది. ప్రేమ వేధింపులకు ఓ ఇంటర్ విద్యార్థిని బలైంది. ఇంటర్ చదువుతున్న తులసి అనే ఇంటర్ విద్యార్థినిని భరత్ అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. భరత్ తులసికి దూరపు బంధువు. దీంతో గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడ్డాడు. తనను ప్రేమించాలని తులసి వెంటపడ్డాడు. అతడి ప్రేమను తులసి నిరాకరించినప్పటికీ వేధింపులు ఆపలేదు. అనంతరం తల్లిదండ్రులకు తులసి తెలియజేసింది. దీంతో వారు భరత్‌ను మందలించారు. అయినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పురాలేదు. ఎక్కడ కనిపిస్తే అక్కడ మాట్లాడడానికి ప్రయత్నించడం, ప్రేమించమంటూ వేధించడం.. వెంటపడడం చేస్తుండటాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. తల్లిదండ్రులు మందలించినా అతడి ప్రవర్తనలో మార్పురాకపోవడంతో ఇక తనకు చావే శరణ్యం అని భావించింది. బుధవారం ఉదయం తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉరివేసుకుని తులసి ఆత్మహత్యకు పాల్పడింది. భరత్ వేధింపుల వల్లే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

Tags:    

Similar News