Sattenapalle: అవినీతి ఆరోపణలపై మంత్రి అంబటి షాకింగ్ రియాక్షన్

మంత్రి అంబటిపై అవినీతి ఆరోపణలు చెలరేగాయి

Update: 2023-05-31 15:46 GMT

దిశ, వెబ్ డెస్క్: మంత్రి అంబటిపై అవినీతి ఆరోపణలు చెలరేగాయి. మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటులో ఆయన అవినీతికి పాల్పడ్డారని ప్రచారం జరుగుతోంది. తొండలు కూడా గుడ్లు పెట్టని భూమిని కోట్లకు కొనుగోలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నాలుగు ఎకరాల భూమిని 8 కోట్ల 88 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారని, మంత్రి అవినీతిపై విచారణ జరపాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

అయితే ఈ ఆరోపణలపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. రాజకీయ కక్షతోనే తనపై అవినీతి ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఆ పొలాన్ని అక్వేర్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. పొలం చేతులు మారితే అవినీతి జరిగినట్లు కాదన్నారు. తాను రూ.8.8 కోట్లు కాజేశానని బజారులో చెప్పండని ఆక్షేపించారు. తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అలా చెప్పినా కూడా ఎవరూ నమ్మరని పేర్కొన్నారు. మురికి కాలువలు కలిసే ప్రాంతంలోనే ఎస్‌టీపీకి అవకాశముందని తెలిపారు. తాను అవినీతి చేశానని నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని మంత్రి అంబటి సవాల్ విసిరారు.

Tags:    

Similar News