దిశ, వెబ్ డెస్క్: ఏపీపీఎస్సీ చైర్మన్, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ రాష్ట్ర హైకోర్టులో హాజరయ్యారు. గౌతమ్ సవాంగ్ డీజీపీగా ఉన్న సమయంలో తనకు పోస్టింగ్ ఇవ్వలేదని గతంలో ఓ ఎస్ఐ పిటిషన్ దాఖలు చేశారు. అయితే పోస్టింగ్ ఇవ్వాలని అప్పట్లోనే హైకోర్టు ఆదేశించింది. కానీ గౌతమ్ సవాంగ్ కోర్టు ఆదేశాలను అమలు చేయలేదు. దాంతో గౌతమ్ సవాంగ్ కోర్టు ఆదేశాలను ధిక్కరించారని ఎస్సై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. దీంతో హైకోర్టుకు హాజరై గౌతమ్ సవాంగ్ వివరణ ఇచ్చారు.
అటు ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్య సైతం హైకోర్టుకు హాజరయ్యారు. ఉద్యోగికి జీతం చెల్లించాలని గతంలో కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు అమలుచేకపోవడంతో కోర్టు ధిక్కరణ కింద హాజరై వివరణ ఇచ్చారు.