ఆ నియోజకవర్గాన్ని మూడు సార్లు చుట్టేసిన మాజీ మంత్రి?

రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఓ స్థానం కల్పించుకున్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ను సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజానీకం అక్కున చేర్చుకుంది.

Update: 2024-02-28 05:03 GMT

దిశ ప్రతినిధి, గుంటూరు: రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఓ స్థానం కల్పించుకున్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ను సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజానీకం అక్కున చేర్చుకుంది. నిన్నమొన్నటి వరకు ఆయనపై అంతంతమాత్రంగా ఆదరణ చూపించిన ప్రజలు ఒక్కసారిగా కన్నా పై ప్రేమ కనబర్చడం  ప్రారంభించారు.దీంతో ప్రజలకు కన్నాపై నమ్మకం పెరిగిందని చెప్పుకోవచ్చు. సత్తెనపల్లి నియోజకవర్గం లో ఆదినుంచి కన్నాకు గట్టి పట్టుండంతో పాటు తన సొంత సామాజిక వర్గం లో బలమైన నాయకులు ఆశీస్సులు అందిస్తూ వస్తున్నారు.ఇదే కన్నాకు కలిసి వచ్చే అంశంగా భావించాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాను వీడిన కన్నా తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న మరుక్షణమే అధినేత చంద్రబాబు తన రాజకీయ చతురతను ప్రదర్శించి కన్నాకు సత్తెనపల్లి ని కన్ఫర్మ్ చేశారు.

ఈ నేపథ్యంలో కన్నాకు ఇన్చార్జి పదవి ఇవ్వడం ఇష్టం లేకపోయిన కొందరు తమ అసంతృప్తిని వెళ్ళగక్కినప్పటికి వాళ్ళ పాచికలు పారలేదు. దీంతో కన్నాను గెలిపించి మన్ననలు పొందాలన్న ఉద్దేశ్యంతో అందరూ ఓ తాటి పై కొచ్చినట్లు సమాచారం. ఇదిలావుంటే రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు నియోజకవర్గంలో ఎదురవుతున్న నిరాదరణ, తన సొంత పార్టీలో పెరిగిన అసమ్మతి కారణంగా కన్నాను డీ కోనే పరిస్థితిని కోల్పోయారన్న విషయం ప్రస్తుత రాజకీయ పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ లోని బలమైన కేడర్ కన్నాకు బహిరంగంగా మద్దతు ప్రకటించి ఆయన గెలుపుకు వ్యూహ రచన చేస్తున్నట్లు వినికిడి. మొత్తం మీద ప్రచారం లో కానీ,గ్రామాల పర్యటనల్లో మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ప్రస్తుత రాష్ట్ర మంత్రి రాంబాబు కంటే ముందంజలో ఉన్నారు. అందుకు తగ్గట్టు గానే ప్రజలు ఆయనను కౌగిలించుకుని మద్దతు పలుకుతున్నారు. నిజానికి చెప్పుకోవాలంటే రానున్న ఎన్నికల్లో అంబటికి సీనియర్ రాజకీయ నాయకుడైన కన్నా చుక్కలు చూపించడం ఖాయంగా కనిపిస్తుంది.

Tags:    

Similar News