YCP Vs TDP: ఎమ్మెల్యే గోపిరెడ్డి ప్రజలకు క్షమాపణలు చెప్పాలి

నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై టీడీపీ నాయకులు దాసరి ఉదయ్ శ్రీ, అలీ బాషాలు ఆగ్రహం వ్యక్తం చేశారు...

Update: 2023-03-22 11:03 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై టీడీపీ నాయకులు దాసరి ఉదయ్ శ్రీ, అలీ బాషాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాణానికి రాకుండా పోలీసులను అడ్డుపెట్టుకొని టీడీపీ ఇన్‌చార్జి అరవింద్ బాబుని అరెస్ట్ చేయిస్తారా అని మండిపడ్డారు. ఎమ్మెల్యేపై చేసిన సవాల్‌లో భాగంగా అవినీతి అక్రమాల చిట్టాను త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో ఉంచి తమ మాట నిలబెట్టుకున్నట్లు వెల్లడించారు. దమ్ము ధైర్యం ఉంటే త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్న గోపిరెడ్డి అవినీతి చిట్టాను ప్రమాణం చేసి తీసుకువెళ్లాలని దాసరి ఉదయ్ శ్రీ, అలీబాషాలు సవాల్ చేశారు. పారిపోవడానికి దారులు వెతుక్కునే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బ్యాచ్ సవాలు చేయడం సిగ్గు చేటు అని విమర్శించారు. బహిరంగ సవాల్‌పై మాట తప్పి మడమ తిప్పిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల నుంచి దోచుకొని, దాచుకున్న ప్రజాధనాన్ని నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేయాలి అని టీడీపీ నాయకులు దాసరి ఉదయ్ శ్రీ, అలీ బాషాలు డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి : అభివృద్ధి, అవినీతిపై ప్రమాణానికి సిద్ధమా..? వైసీపీ ఎమ్మెల్యేకు టీడీపీ నేత సవాల్

Tags:    

Similar News