విశాఖలో ఎమ్మార్వోను హత్య చేసింది వారే.. నారా లోకేశ్ సంచలన ఆరోపణలు

విశాఖ జిల్లా మధురవాడ కొమ్మదిలో తహశీల్దార్ రమణయ్యను చంపింది వారేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపణలు చేశారు.

Update: 2024-02-03 11:58 GMT

దిశ, వెబ్ డెస్క్: విశాఖ జిల్లా మధురవాడ కొమ్మదిలో తహశీల్దార్ రమణయ్య దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ సంచలన ఆరోపణలు చేశారు. భూ అక్రమాలకు సహకరించలేదని ఎమ్మెర్వో రమణయ్యను వైసీపీ నేతలే దారుణంగా చంపారని ఆయన ఆరోపించారు. అవినీతి, అక్రమాలు, ఆరాచకాలు సృష్టిస్తూ, వేధింపులకు పాల్పడుతూ ప్రభుత్వ ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ దోపిడీని అడ్డుకుంటున్నారనే ఉద్యోగులపై దారుణాలకు ఓడిగడుతున్నారని ధ్వజమెత్తారు. సొంత బాబాయ్‌నే చంపిన జగన్ గ్యాంగ్ తమ దోపిడీలకు సహరించని ఉద్యోగులను తొలగించుకుంటున్నారన్నారు. వైసీపీ నేతల అవినీతికి ఉద్యోగులెందుకు బలి కావాలని ప్రశ్నించారు. జగన్ ఐదేళ్ల పాలనలో వంద మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వారంలో ముగ్గురు బలయ్యారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వ అంతానికి ఇంకా రెండు నెలలే సమయం ఉందని సెటైర్లు వేశారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మార్వోను చంపిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags:    

Similar News