Tdp-Janasena: ఉమ్మడి ఆత్మీయ సమావేశాలకు ముందే కీలక లిస్ట్ విడుదల చేసిన జనసేన

టీడీపీ- జనసేన నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశాలు మంగళవారం నుంచి జరగనున్నాయి...

Update: 2023-11-13 16:08 GMT

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ- జనసేన నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశాలు మంగళవారం నుంచి జరగనున్నాయి. ఇక నుంచి ప్రతి 15 రోజులకోసారి వరుసగా మూడు రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం, బుధవారం, గురువారం నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశాలు జరనున్నాయి. 175 నియోజకవర్గాల్లో ఉమ్మడి ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నారు. దీంతో నియోజకవర్గాల వారీగా తెలుగుదేశం పార్టీతో సమావేశాల నిర్వహణ, సంప్రదింపుల కోసం జనసేన సమన్వయ బాధ్యులను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నియమించారు. ఇందుకు సంబంధించి మొత్తం 156 మందిని నియమిస్తూ జాబితాను విడుదల చేశారు.

కాగా టీడీపీ-జనసేన పొత్తుతో వచ్చే ఎన్నికలకు వెళ్లనున్నాయి.  ఈ నేపథ్యంలో రెండు పార్టీ నేతలు, నాయకులను ఒకేతాటిపైకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీల అధినేతలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ-జనసేన ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కీలక సమావేశం నిర్వహించి టీడీపీ-జనసేన మినీ మేనిఫెస్టోపై కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 11 అంశాలతో ఉమ్మడి మినీ మేనిఫెస్టోను విడుదల చేశారు. రేపటి నుంచి జరగబోయే నియోజకవర్గ స్థాయి ఉమ్మడి ఆత్మీయ సమావేశాలకు సర్వం సిద్ధం చేశారు. ఈ ఆత్మీయ సమావేశాల్లో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. 

Tags:    

Similar News