4 లేన్లుగా శంకర్ విలాస్ వంతెన.. ప్రకటించిన కేంద్ర మంత్రి గడ్గరీ

Update: 2024-10-16 04:08 GMT

దిశ, ప్రతినిధి గుంటూరు: గుంటూరు ప్రజానీకం కలలకు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఊపిరిలూదారు. ట్రాఫిక్ సమస్యలను తీర్చడంలో ప్రధాన పాత్ర పోషించే శంకర్ విలాస్ వంతెన (ఆర్ఓబీ) నాలుగు లేన్ల విస్తరణకు ఆయనకు చేస్తున్న కృషికి కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ప్రకటించింది. సీఆర్ఐఎఫ్ పథకం కింద రూ. 98 కోట్లను మంజూరు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఎక్స్ ఖాతా వేదికగా ప్రకటించారు. దీంతో శంకర్ విలాస్ మార్గంలో నగర ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలు ఇకపై తొలగనున్నాయి.

క్యూ కడుతున్న ప్రాజెక్టులు..

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేస్తున్న పెమ్మసాని నేతృత్వంలో గుంటూరు పార్లమెంటుకు ప్రాజెక్టులు, పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. మొన్న అమరావతికి రూ. 250 కోట్ల విలువైన టెక్నాలజీ సెంటర్ మంజూరవగా, నిన్న ప్రత్తిపాడు నియోజకవర్గంలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రికి కేంద్రం ఓకే చెప్పింది. తాజాగా శంకర్ విలాస్ నాలుగు లైన్ల విస్తరణకు ఆమోదం లభించింది.


Similar News