Tenali: బూతులు తిట్టుకుంటూ కౌన్సిలర్ల కొట్లాట (Viral Video)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం యుద్ధాన్ని తలపిస్తోంది...
దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం యుద్ధాన్ని తలపిస్తోంది. గతంలో ఎక్కడో అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కొట్టుకుంటే ఔరా అని రాష్ట్ర ప్రజలు నోరెళ్లబెట్టిన సంగతి తెలిసిందే. ఆ కొట్లాటను చూసి నేర్చుకున్నారో ఏమో తెలియదు కానీ ఇటీవలే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కొట్టుకున్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కొట్టుకుంటే లేనిది మనం ఎందుకు కొట్టుకోకూడదనుకున్నారో ఏమో ఏకంగా తెనాలి మున్సిపల్ సమావేశంలో వైసీపీ, టీడీపీ కౌన్సిలర్లు కొట్టుకున్నారు. ముష్టియుద్ధానికి దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించారు. రౌడీ కౌన్సిలర్లు మాదిరిగా తరుముకుంటూ మరీ వెళ్లి కొట్టుకున్నారు. అడ్డుకున్నా వదల్లేదు. మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చించాల్సింది పోయి బూతులకు పని చెప్పారు. కౌన్సిలర్లు అమ్మనా బూతులు తిట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే సమావేశంలో ఇరువురుని చెదరగొట్టిన మున్సిపల్ చైర్మన్ అనంతరం సమావేశం నుంచి వెళ్లిపోయారు.