Macherla: లో 144 సెక్షన్.. భారీగా పోలీసుల మోహరింపు

పల్నాడు జిల్లా మాచర్లలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు, ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసు బలగాలు మోహరించాయి....

Update: 2022-12-17 10:32 GMT

దిశ, డైనమిక్: పల్నాడు జిల్లా మాచర్లలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు, ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసు బలగాలు మోహరించాయి. ప్రజలు గుంపులుగా తిరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఏ క్షణమైనా పరిస్థితి మళ్లీ తీవ్రంగా మారే అవకాశం ఉందనే అనుమానంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పహరాకాస్తున్నారు. స్వయంగా ఎస్పీ రవిశంకర్ రెడ్డి పరిస్థితిని పరిశీలిస్తున్నారు. మరిన్ని దాడులు జరగకుండా పటిష్ఠ బందోబస్తు సిద్ధం చేశారు. ప్రస్తుతానికి మాచర్లలో 144 సెక్షన్ అమలు చేస్తుండగా ఎక్కడా షాపులు పోలీసులు మూయించేస్తున్నారు.

మాచర్ల ఘటనపై డీజీపీ రాజేంద్రనాథ్ విచారణకు ఆదేశం

మాచర్ల ఘటనపై డీజీపీ రాజేంద్రనాథ్ స్పందిస్తూ విచారణకు ఆదేశించారు, మాచర్లలో అదనపు బలగాలను మోహరించినట్టు చెప్పారు. ఘటనపై విచారణకు ఐజీ త్రివిక్రమ్‌ను మాచర్లకు పంపినట్టు వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని చెప్పారు. శాంతిభద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. ఘటనకు పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదని చెప్పారు.

ఇది చంద్రబాబు, లోకేశ్ కుట్ర: ఎమ్మెల్యే పిన్నెల్లి

పల్నాడుపై టీడీపీ పగబట్టిందని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చంద్రబాబు, నారా లోకేష్ కుట్రలో భాగమే మాచర్లలో మంటలని.. ఫ్యాక్షన్ నాయకుడిని మాచర్లకు పంపి దాడులు చేయిస్తున్నారన్నారు. బ్రహ్మారెడ్డి వచ్చిన తర్వాత మాచర్లలో విధ్వంసాలు పెరిగిపోయాయని ఆరోపించారు. పల్నాడులో విధ్వంసానికి చంద్రబాబు, లోకేష్‌లదే బాధ్యత అన్నారు. రాజకీయ లబ్ది పొందాలని కుట్ర చేస్తున్నారని.. కార్యక్రమం చేసుకోవాలని అనుకున్న నాయకులు కర్రలు, రాడ్‌లతో దాడులు చేస్తారా? అంటూ మండిపడ్డారు.

కార్యరూపం దాల్చని ఎన్టీఆర్ జాతీయ పార్టీ.. పేరేంటో తెలుసా? 

Tags:    

Similar News