గుంటూరులో దంచి కొట్టిన వర్షం.. ఆ ప్రాంతం విలవిల

గుంటూరులో భారీగా వాన పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు..

Update: 2024-10-19 13:32 GMT

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు(Guntur)లో వర్షం దంచి కొట్టింది. శనివారం మధ్యాహ్నం గంటపాటు భారీగా వాన(Heavy Rain) కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. గుంటూరు నగరంలో ఏ రోడ్డు చూసినా చెరువులను తలపించాయి. ఏసీ కాలేజీ నుంచి వుమెన్స్ కాలేజీకి వెళ్లే రోడ్డుపై రెండు, మూడు అడుగుల మేర నీళ్లు నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నీళ్లలో పలు వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం పడిన ప్రతిసారి ఇలాగే నీళ్లు నిలిచిపోతాయని స్థానికులు తెలిపారు. వర్షం పడితే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతాయని చెప్పారు. వాన పడితే వాహనదారులు, కాలేజీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రమేశ్ హాస్పిటల్ నుంచి ఏసీ కాలేజీ, శంకర్ విలాస్ బ్రిడ్జి వరకూ నీళ్లు నిలిచిపోతాయని, రోడ్లు, డ్రైనేజీలను మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు. 


Similar News