ఆపితే ఆగడానికి Nara Lokesh ఆర్టీసీ బస్సు కాదు.. బుల్లెట్ ట్రైన్!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని, ఆపితే ఆగడానికి ఆయన ఆర్టీసీ బస్సు కాదని, బుల్లెట్ ట్రైన్ అని మంగళగిరి టీడీపీ నేతలు అన్నారు....

Update: 2023-01-23 14:04 GMT
  • 'యువగళం' పాదయాత్రతో 1983 నాటి ప్రభంజనం ఖాయం
  • టీడీపీ జాతీయ కార్యాలయంలో ఘనంగా నారా లోకేశ్ జన్మదిన వేడుకలు

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని, ఆపితే ఆగడానికి ఆయన ఆర్టీసీ బస్సు కాదని, బుల్లెట్ ట్రైన్ అని మంగళగిరి టీడీపీ నేతలు అన్నారు. నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలను టీడీపీ జాతీయ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాణా సంచా పేల్చి భారీ కేక్ కట్ చేశారు. టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయ మహిళా సిబ్బందికి చీరలు పంపిణీ చేశారు.


టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ 'నారా లోకేశ్ పాదయాత్రతో వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. జగన్ రెడ్డి పాలనలో అభివృద్ది శూన్యం. ఏ ఒక్క వర్గం ప్రజలు సంతోషంగా లేరు. జగన్ రెడ్డిని నమ్మి నట్టేటా మునిగామని ప్రజలంతా వాపోతున్నారు. వైసీపీ పాలనలో దగా పడిన రాష్ట్ర ప్రజలంతా నారా లోకేశ్ చేపట్టనున్న 'యువగళం' పాదయాత్ర కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి ఊరు, వాడ బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీన్ని గ్రహించే జగన్ రెడ్డి, వైసీపీ నేతలు ఓటమి భయంతో పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు. యువగళానికి ప్రజా బలం ఉంది. జగన్ రెడ్డి కుట్రలను తిప్పి కొట్టి పాదయాత్రను ప్రజలే విజయవంతం చేస్తారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 1983 నాటి ప్రభంజనం ఖాయం.' అని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ, నాగుల్ మీరా, టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రఘురామ్ రాజు, పరుచూరి ప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చి రాంప్రసాద్, మీడియా కో ఆర్డినేటర్ దారపనేని నరేంద్ర బాబు, టీడీపీ రాష్ట్రకార్యదర్శి ఏవీ రమణ, ఎన్.ఆర్.ఐ విభాగం వేమూరి రవి కుమార్, చప్పిడి రాజశేఖర్, గుంటుపల్లి జయకుమార్, కోటేశ్వరరావు, ఆహ్వాన కమిటీ సభ్యులు హసన్ భాషా, పరుచూరి కృష్ణ, దేవినేని శంకర్ నాయుడు, టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి చరణ్ యాదవ్, రెంటపల్లి శ్యామ్, సత్యం, ఎన్.ఆర్ ఐ ట్రైనింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : Breaking News: Nara Lokesh పాదయాత్రకు గ్రీన్‌సిగ్నల్

Tags:    

Similar News