Ambati Rambabu: పవన్ కల్యాణ్ కూలీ నెంబర్ వన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూలి నెంబర్-1 అంటూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు...
దిశ, డైనమిక్ బ్యూరో: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూలి నెంబర్1 అంటూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్, జనసేన పార్టీ మరగుజ్జులా రోజు రోజుకి దిగజారిపోతున్నాడని ధ్వజమెత్తారు. సత్తెనపల్లిలో శుక్రవారం మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. వారాహి వాహనానికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే కదులుతుందంటూ సెటైర్లు వేశారు. రాజకీయాలు అంటే తెలియని వ్యక్తి..రాజకీయాలకు అసలు పనికి రాని వ్యక్తి పవన్ కల్యాణ్ అని అంబటి విమర్శశించారు. సత్తెనపల్లిలో మట్టం అశోక్ అనే వ్యక్తి పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని అని, పార్టీ కోసం కష్టపడి పని చేసి ప్రాణాలు కోల్పోతే కనీసం పరామర్శించలేదని విమర్శించారు. పాపం పసివాడు అంటూ సీఎం జగన్‌పై పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణే పాపం పసివాడు అని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
దేశంలోనే లక్షలాదిగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత ఒక్క వైసీపీకి మాత్రమే దక్కుతుందని అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లిలో తనను ఓడించాలని కొత్త కొత్త వ్యక్తులను దించి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుని పవన్‌ని నమ్మితే ఈ రాష్ట్రం సర్వ నాశనం అవుతుందని అన్నారు. చంద్రబాబు అమరావతిలో కొంత మంది రైతులను రెచ్చగొట్టి కోర్టులకు పంపిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికి మూడు రాజధానులకు కట్టుబడివున్నామని.. రాజధానిలో పేద ప్రజలు ఉండకూడదా? అని అంబటి నిలదీశారు. వంద మంది చంద్రబాబులు, వెయ్యి మంది పవన్ కల్యాణ్‌లు కలిసి వచ్చినా ఎవరు ఏమీ చేయలేరని మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.
చంద్రబాబు నాయుడు దళిత ద్రోహి అంటూ మంత్రి అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబాబు సత్తెనపల్లి పర్యటనలో భాగంగా కంటెపూడి గ్రామంలో దివ్యాంగురాలిని పరామర్శించి..బాధితురాలికి ట్రై సైకిల్ లక్షరూపాయలు ప్రకటించి మోసం చేశాడని విమర్శించారు. చంద్రబాబు హామీలు బుటకపు మాటలు అని మండిపడ్డారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకే దళితులకు సాయం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు దళితులకు క్షమాపణ చేప్పాలి అని డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో 50 వేల మందికి పట్టాలు పంపిణీ చేస్తుంటే చంద్రబాబు నాయుడు ఓర్చుకోవడం లేదన్నారు. 2024ఎన్నికలు పేదలకు.. పెత్తందారులకు మధ్య జరిగే పోటీ అని మంత్రి అంబటి రాంబాబు అభివర్ణించారు