వికేంద్రీకరణపై చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు.. సజ్జల సంచలన వ్యాఖ్యలు

వికేంద్రీకరణపై చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు....

Update: 2023-03-31 10:55 GMT

దిశ, వెబ్ డెస్క్: వికేంద్రీకరణపై చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అమరావతికి చంద్రబాబు ఏమీ చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. అమరావతిలో వేల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. అమరావతి అభివృద్ధిపై ప్రభుత్వం చాలా స్పష్టమైన హామీ ఇచ్చిందని తెలిపారు. వికేంద్రీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్ధం కావడంలేదని సజ్జల వ్యాఖ్యానించారు. ఆయన హయాం అభివృద్ధి చేస్తామంటే ఎవరైనా అడ్డుకున్నారా..? అని ప్రశ్నించారు. ఐదేళ్లలో అభివృద్ధి చేయలేమని వాళ్లే ఒప్పుకున్నారని తెలిపారు. 20 ఏళ్ల పాటు రాజధాని పేరుతో భూములు కబ్జా చేయాలని చంద్రబాబు ఆలోచించారని సజ్జల పేర్కొన్నారు. ‘వికేంద్రీకరణ వల్ల ఎవరికీ నష్టం లేదు. విజయవాడ, గుంటూరు బాగా అభివృద్ధి చెందుతున్నాయి. అక్కడి వాళ్లు కూడా హ్యాపీగా ఉన్నారు.’ అని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.

Read more:

అమరావతికి మద్దతిస్తే దాడి చేస్తారా..?.. ఎంపీ నందిగాం సురేశ్‌పై రమేశ్ నాయుడు ఆగ్రహం

Tags:    

Similar News