Manikya Varaprasad: ఆ భూములను వెనక్కి తీసుకోండి: మాజీ మంత్రి డొక్కా డిమాండ్

సరస్వతీ పవన్ కంపెనీకి పల్నాడు జిల్లాలో ఏపీ ప్రభుత్వం(AP Government) కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు

Update: 2024-10-27 11:41 GMT

దిశ, వెబ్ డెస్క్: సరస్వతీ పవన్ కంపెనీ(Saraswati Pawan Company)కి పల్నాడు జిల్లాలో ఏపీ ప్రభుత్వం(AP Government) కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్(Former Minister Dokka Manikya Varaprasad) డిమాండ్ చేశారు. సరస్వతీ కంపెనీ 15 ఏళ్ల క్రితం ప్రభుత్వం నుంచి భూములు తీసుకుని ఇప్పటివరకూ ఒక్క పరిశ్రమను కూడా ఏర్పాటు చేయలేదని ఆయన తెలిపారు. ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, సొసైటీ ద్వారా రైతులకు కౌలుకు ఇవ్వాలని మాణిక్యవరప్రసాద్ సూచించారు. అలా చేయకపోతే పారిశ్రామిక వేత్తలకు నూతనంగా కేటాయించాలన్నారు. తద్వారా రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని, ఉపాధి సైతం పెరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఆస్తుల వ్యవహారంలో వైఎస్ విజయమ్మ(YS Vijayamma), షర్మిల(Sharmila)కు ప్రాణ హాని ఉందని, వారికి భద్రత పెంచాలని ప్రభుత్వానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ విజ్ఞప్తి చేశారు.


Similar News