Ap Govt: చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ సస్పెన్షన్

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌పై ప్రభుత్వం వేటు వేసింది...

Update: 2023-09-30 10:21 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌పై ప్రభుత్వం వేటు వేసింది. ప్రభుత్వ సర్వీస్ రూల్స్ అతిక్రమించారని ఆయనను సస్పెండ్ చేసింది. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పి. శ్రీనివాస్ ప్రస్తుతం ప్లానింగ్ డిపార్ట్ మెంట్‌లో అసిస్టెంట్ సెక్రటరీగా పని చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఆయన అమెరికా పారిపోయారని వెళ్లిపోయారు. దీంతో పి.శ్రీనివాస్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కాగా, చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో పి. శ్రీనివాస్‌పై అభియోగం ఉంది. చంద్రబాబు ఇచ్చిన ఐటీ నోటీసుల్లో కూడా ఆయన కీలకంగా ఉన్నారు. శ్రీనివాస్ ద్వారానే చంద్రబాబుకు నిధులు చేరాయనే ఆరోపణ ఉంది. 


Tags:    

Similar News