Breaking: వైసీపీ నేతలు వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవ్‌పై మరో కేసు
వైసీపీ నేతలు వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవ్‌పై మరో కేసు నమోదు అయింది..
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెరుగుతున్నాయి. బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. తమను కించపరుస్తూ అసభ్యకర పోస్టులు పెట్టారంటూ పేర్కొంటున్నారు. దీంతో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురి కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించగా.. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తు్న్నారు. ఇవే కేసుల్లో మరికొంతమందిని అదుపులోకి తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బాధితుల నుంచి అందించిన ఫిర్యాదులతో వైసీపీ నేతలు వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారు. సిద్దవటం మండలానికి చెందిన జనసేన కార్యకర్త, దళిత వ్యక్తి వెంకటాద్రి ఫిర్యాదు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై చేసిన అసభ్యకర పోస్టును తొలగించాలని, కులం పేరుతో తనను వర్రా రవీంద్రారెడ్డి గ్యాంగ్ దూషించడంతో పాటు డబ్బు డిమాండ్ చేశారని, ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారని ఫిర్యాదులో వెంకట్రాది పేర్కొన్నారు.