Ap Government‌కు ఉద్యోగుల డెడ్ లైన్

ఉద్యోగాల సమస్యల పరిష్కారానికి ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డెడ్ లైన్ విధించారు..

Update: 2023-02-24 13:16 GMT
  • ఈనెల 26లోపు తేల్చకుంటే పోరుబాటే
  • ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు

దిశ, డైనమిక్ బ్యూరో: ఉద్యోగాల సమస్యల పరిష్కారానికి ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డెడ్ లైన్ విధించారు. ఉద్యోగుల సమస్యలపై రోడ్ మ్యాప్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 26లోపు ప్రభుత్వం స్పందించాలని కోరారు. లేకుంటే ఈనెల 26న అమరావతిలో ఉద్యోగ సంఘాల సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఇకపోతే రాష్ట్రంలో 1వ తేదీన జీతాలు, పెన్షన్లు తీసుకునే పరిస్థితి లేదని విచారం వ్యక్తం చేశారు. 2018 నుంచి రావాల్సిన 6 డీఏలు అందలేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News