Ap News: ధాన్యం కొనుగోళ్లపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

ధాన్యం కొనుగోలులో ఎలాంటి అవినీతి జరగకూడదని, మద్దత ధరపై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అన్నారు...

Update: 2023-10-11 14:23 GMT

దిశ, వెబ్ డెస్క్: ధాన్యం కొనుగోలులో ఎలాంటి అవినీతి జరగకూడదని, మద్దత ధరపై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలతో పాటు సివిల్ సప్లైపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా పలు విషయాలను అధికారులకు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మద్దతు ధర ఇవ్వడంతో పాటు జీఎల్టీ రూపంలో క్వింటాల్‌కు సుమారు రూ.250లపైనే అదనంగా రైతులకు ఇస్తున్నామని

తెలిపారు. ధాన్యం కొనుగోలు సమయంలో ఎప్పటిలాగే మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయం పూర్తి నివారించాలని అధికారులకు సూచించారు. ఎట్టి పరిస్థితిల్లోనూ మిల్లర్ల వద్దకు రైతులు వెళ్లకుండా బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఏర్పాటు యూనిట్లను ఉపయోగించి ఈ మిల్లేట్స్ ప్రాసెస్ చేయాలని సూచించారు. ప్రతి సంవత్సరం రైతుల నుంచి తృణ ధాన్యాలు కొనుగోలు పెరిగే అవకా: ఉందని, ఈ మేరకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు.

Tags:    

Similar News