Amaravati: వరద పరిస్థితులపై అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు

వరద పరిస్థితిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు...

Update: 2023-07-27 16:53 GMT

దిశ, వెబ్ డెస్క్: వరద పరిస్థితిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షాలపై సమీక్షించిన ముఖ్యమంత్రికి ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాల్లో పరిస్థితులను అధికారులు వివరించారు. 458 గ్రామాలను అప్రమత్తం చేసినట్లు సీఎం జగన్‌కు అధికారులు తెలిపారు. మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 4 ఎస్డీఆర్ఎస్ బృందాలను అందుబాటులో ఉంచినట్లు సీఎంకు వివరించారు. అలాగే ముంపు ప్రాంతాల్లో బోట్లు, సహాయక సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గోదావరిని ఆనుకుని ఉన్న జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ముందస్తుగా పలు ప్రాంతాల్లో సహాయక శిబిరాలను ఏర్పాటు చేశామని సీఎంకు అధికారులు తెలిపారు.

ఈ సందర్బంగా అధికారులకు సీఎం జగన్ పలు సూచనలు చేశారు. ముంపు బాధితులకు బాసటగా నిలవాలని, వరద ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం సూచించారు. సదుపాయాల విషయంలో ఎక్కడా లోటు రాకుండా చూడాలని సీఎం ఆదేశించారు. 


Similar News