కృష్ణా జలాలపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమావేశం

కృష్ణా జలాలపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు....

Update: 2023-10-09 16:06 GMT

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జలాలపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టులో ఎస్పీఎల్ దాఖలు చేసేందుకు అధికారులు, న్యాయనిపుణులతో చర్చలు జరిపారు. రాష్ట్ర ప్రయోజనాల రక్షణ విషయంలో వెనక్కి తగ్గొద్దని ఈ సందర్బంగా అధికారులకు సీఎం జగన్ సూచించారు. ఎక్కడా కూడా రాజీపడాల్సిన అవసరం లేదని తెలిపారు. గెజిట్ తర్వాత ప్రధాని మోడీకి లేఖ రాయాలని నిర్ణయించారు. మార్గదర్శకాలు విభజన చట్టాలకు విరుద్ధంగా ఉన్నాయని సీఎం జగన్‌కు అధికారులు తెలిపారు. కేంద్ర జారీ చేసిన నోటిఫికేషన్ రాష్ట్ర విభజన చట్టాన్ని ఉల్లంఘించేలా ఉందని స్పష్టం చేశారు. 

Tags:    

Similar News