CM Chandrababu: ఆర్టీజీపై సీఎం ఫోకస్.. అధికారులకు కీలక సూచన
సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు...
దిశ, వెబ్ డెస్క్: సచివాలయంలో శుక్రవారం రియల్ టైమ్ గవర్నెన్స్(Real Time Governance) (ఆర్టీజీ)పై సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) సమీక్ష నిర్వహించారు. ఆర్టీజీఎస్‌లో జరుగుతున్న డాటా ఇంటిగ్రేషన్ పనులపై ఆరా తీశారు. అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీజీ శాఖ కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్, ఆర్టీజీఎస్ సీఈఓ కె. దినేష్ కుమార్‌లు ఆర్టీజీఎస్ ద్వారా చేపడుతున్న డాటా ఇంటిగ్రేషన్ పనుల ప్రగతిపై ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఆర్టీజీ అనేది ప్రభుత్వానికి రియల్ టైమ్ డాటా అందించే ఏకైక వనరుగా పని చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్(Chief Secretary Nirabh Kumar Prasad), వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.