పొన్నూరులో Chandrababu కీలక వ్యాఖ్యలు.. రోడ్ షోకు పోటెత్తిన జనం
గుంటూరు జిల్లా పొన్నూరులో 'ఇదేం ఖర్మ' మన రాష్ట్రానికి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. నారా కోడూరులో రోడ్ షో నిర్వహించారు. అయితే చంద్రబాబు రోడ్ షోకు అనూహ్య స్పందన వచ్చింది. ..
దిశ, డైనమిక్ బ్యూరో : గుంటూరు జిల్లా పొన్నూరులో 'ఇదేం ఖర్మ' మన రాష్ట్రానికి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. నారా కోడూరులో రోడ్ షో నిర్వహించారు. అయితే చంద్రబాబు రోడ్ షోకు అనూహ్య స్పందన వచ్చింది. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 'సైకో పాలన వద్దు....సైకిల్ పాలన కావాలి. నేను ముఖ్యమంత్రి పదవి కోసం ఇక్కడికి రాలేదు. నా తమ్ముళ్ళ కోసం, రైతుల కోసం, యువత కోసం వచ్చాను. రాష్ట్రం కోసం వచ్చాను'. అని చంద్రబాబు తెలిపారు. 'నిన్న మొన్నటి వరకు బాదుడే బాదుడు చేశాం. ఇప్పుడు ఇదేం ఖర్మ రాష్ట్రానికి అని కార్యక్రమం మొదలు పెట్టాం. రాష్ట్ర ఉన్న పరిస్థితికి సరైన పేరు ఇదేం ఖర్మ .' అని చంద్రబాబు అన్నారు.
'జగన్‌కు నాలుగేళ్ల తరువాత బీసీలు గుర్తు వచ్చారు. బీసీ మీటింగ్ పెట్టాడు. సభకు జనం ఇష్టపూర్వకంగా వెళ్లలేదు. పథకాలు తీసేస్తామని భయపెట్టి తీసుకు వెళ్లారు. టీడీపీ మీటింగ్‌లకు స్వచ్ఛందంగా వస్తున్నారు. మన కోసం రాత్రి వరకు ఉంటున్నారు. వైసీపీ సభల నుంచి జనం పారిపోతున్నారు' అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుటుంబం నాటి నుండి టీడీపీలో ఉందన్నారు. పొన్నూరులో 9 సార్లు ఎన్నికలు జరిగితే 7 సార్లు గెలిచిన కుటుంబం ధూళిపాళ్ల కుటుంబమని గుర్తు చేశారు. అందులో వరుసగా 5 సార్లు గెలిచిన నరేంద్రను అక్రమ కేసులు పెట్టి వేధించారని మండిపడ్డారు. 'జగన్ రెడ్డి ఒక అమూల్ బేబి. అమూల్ ఆయనకు ముద్దు. మనం అప్రమత్తంగా లేకపోతే రాష్ట్రాన్ని కాపాడుకోలేము. రాష్ట్రం కోసం అంతా కలిసి రండి...నేను ముందు ఉండి పోరాడుతా' అని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
READ MORE
మళ్లీ సెంటిమెంట్‌ను రగిలిస్తున్నారు.. సజ్జల కామెంట్స్‌పై భట్టి ఫైర్