బ్రేకింగ్: స్క్రిప్ట్ తిరగరాశారు.. వైసీపీ రెబల్స్‌పై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు....

Update: 2023-03-24 12:44 GMT

దిశ, వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలిచారు. అయితే టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి ఓటు వేశారు. దీనిపై చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వచ్చే టీడీపీ ప్రభుత్వంలో పైరవీలు ఉండవని చెప్పారు. సీఎం జగన్‌పై వైసీపీ ఎమ్మెల్యేలకు నమ్మకం లేదన్నారు. నలుగురు ఎమ్మెల్యేలు తమకు ఓటు వేసి స్క్రిప్ట్ తిరగరాశారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీ కొనుగోలు చేసిందని చంద్రబాబు ఆరోపించారు.

కాగా ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో గెలుపొందారు. అయితే నాలుగు ఓట్లు క్రాస్ అవడంతో టీడీపీ విజయం సాధించినట్లు స్పష్టమైంది. అటు టీడీపీకి చెందిన నలుగురు ఓట్లు కూడా వైసీపీకి పడ్డాయి.  దీంతో ఆ రెండు పార్టీల మధ్య రాజకీయం మరింత వేడెక్కింది. ఇరు పార్టీల నేతలు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. 

మరోవైపు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలకు వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. విప్ ధిక్కరించారనే కారణంతో నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ సస్పెన్షన్‌ను ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్వాగతించారు. ప్రజలు ఆదరిస్తే మళ్లీ గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. 

Read more:

సస్పెన్షన్ పై కోటంరెడ్డి ఏమన్నారంటే.

Tags:    

Similar News