Breaking: ఆ కులాలకూ రూ. లక్ష సాయం
ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలపై జోరు పెంచారు..
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలపై జోరు పెంచారు. ఇప్పటికే చాలా పథకాలు అమలు చేశారు. ఇప్పుడు ఆ వేగాన్ని మరింత చేశారు. నాలుగు కులాలకు లక్ష సాయం చేసేందుకు సిద్ధమయ్యారు. వైఎస్సార్ షాదీ తోఫా పేరుతో 2020 అక్టోబర్ 1 నుంచి మైనార్టీ వర్గాలకు పెళ్లి కానుకగా రూ. లక్ష అందజేస్తున్నారు. అయితే దూదేకుల, నూర్ బాషా, పింజారీ, లదాఫ్ కులాలకు ఇప్పటి వరకూ ఎలాంటి లబ్ధి చేకూర్చలేదు. దీంతో ఆ కులాలకు కూడా షాదీ తోఫా వర్తింపు చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఆ నాలుగు కులాలకు చెందిన వారు పెళ్లి చేసుకుంటే మైనార్టీలుగా పరిగణిస్తూ షాదీ తోఫా అమలు చేయాలని ఉత్తర్వులు చేశారు. పెళ్లి చేసుకున్న కొత్త జంటకు రూ.లక్ష సాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
మిగిలిన కూలాల వారికి కూడా వైఎస్సార్ కల్యాణ మస్తు పేరుతో పెళ్లి కానుకలు అందజేస్తున్నారు. అటు మైనార్టీ వర్గాలకు షాదీ తోఫా పేరుతో రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నారు. తాజాగా సీఎం తీసుకున్న నిర్ణయంతో మరో నాలుగు కులాలకు కూడా షాదీ తోఫా లబ్ధి చేకూరనుంది.