Guntur: లంచాల డబ్బుతో ఇంట్లోనే బంగారం, వెండి నగల ఖజానా

గుంటూరు హౌసింగ్ కార్పొరేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పని చేస్తున్న చుంచు కృష్ణయ్య అక్రమ ఆస్తులపై ఏసీబీ దాడులు చేసింది....

Update: 2023-06-23 17:30 GMT

దిశ, గుంటూరు: గుంటూరు హౌసింగ్ కార్పొరేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పని చేస్తున్న చుంచు కృష్ణయ్య అక్రమ ఆస్తులపై ఏసీబీ దాడులు చేసింది. లంచాల డబ్బుతో ఇంట్లోనే పెట్టుకున్న బంగారం , వెండి, నగల ఖజానా చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. ఒంగోలు టౌన్ లంబాడి డొంకలో జి+3 ఇల్లు, భాగ్య నగర్‌లో ఒక ఫ్లాట్. ఒంగోలు మండలం కొప్పోలులో 8 ఇళ్ల స్థలాలు, చీరాల టౌన్‌లో 8 పోర్షన్‌లతో కూడిన ఒక ఇల్లు (జి+1), కొత్తపేట, చీరాలలో రెండు ఇళ్ల స్థలాలు, దైవాల రావూరులో ఒక ఇల్లు, రెండు కార్లు, రెండు మోటార్ సైకిళ్ళు ఉన్నట్లు గుర్తించారు. ఇంకా సుమారు 1 కేజీ బంగారు ఆభరణాలు, సుమారు 6 కిలోలు, ఎలక్ట్రికల్ గాడ్జెట్లు, బ్యాంక్ బ్యాలెన్స్, చినగంజాం మండలం కడవకుదురు వద్ద ఒక ఎకరం భూమి, 90 సెంట్లు వ్యవసాయ భూమి కొనుగోలు కోసం రెడీ చేసిన 50 లక్షల సేల్ డీడ్ అగ్రిమెంట్ కాగితాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చుంచు కృష్ణయ్యపై శాఖా పరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు. 

Tags:    

Similar News