టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన 30 మంది మ‌హిళ‌లు

వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీతోనే ప్ర‌జ‌లంద‌రికీ మేలు చేకూరుతుంద‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి,గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్థి విడ‌ద‌ల ర‌జని తెలిపారు.

Update: 2024-03-18 14:30 GMT

దిశ ప్రతినిధి,గుంటూరు:వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీతోనే ప్ర‌జ‌లంద‌రికీ మేలు చేకూరుతుంద‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి,గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్థి విడ‌ద‌ల ర‌జని తెలిపారు. గుంటూరులోని ఏటీ అగ్ర‌హారం ఆరో లైనులో పరశురామ బ్రాహ్మణ సంఘం మహిళా విభాగం కార్యదర్శి నందిరాజు మీనాక్షి ఆధ్వర్యంలో సోమ‌వారం 30 మంది మహిళలు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్‌ సీపీలో చేరారు. వైఎస్సార్‌ సీపీ గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ సోష‌ల్ మీడియా క‌న్వీన‌ర్ య‌ద్ద‌న‌ప‌ల్లి బాల‌రాజు కార్య‌క్ర‌మానికి స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించారు. ముఖ్య అతిథిగా హాజ‌రైన విడ‌ద‌ల ర‌జని మ‌హిళ‌ల‌కు పార్టీ కండువా క‌ప్పి సాద‌రంగా ఆహ్వానించారు. వారంద‌రితో ఆప్యాయంగా మాట్లాడారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గుంటూరు పశ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ప్ర‌భంజ‌నం సృష్టిస్తుంద‌ని తెలిపారు.

ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా త‌ర‌లివ‌చ్చి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కి మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నార‌ని తెలిపారు. మ‌హిళ‌ల్లో పెద్ద ఎత్తున సానుకూల స్పంద‌న క‌నిపిస్తున్న‌ద‌ని తెలిపారు. రాష్ట్ర చ‌రిత్ర‌లో తొలిసారి మ‌హిళా సాధికార‌త సాధ్యం దిశ‌గా రాష్ట్రంలో ఈ ఐదేళ్ల పాల‌న కొన‌సాగింద‌ని వివ‌రించారు. ముఖ్య మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన న‌వ‌ర‌త్నాలు ప‌థ‌కాలు అన్నీ మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యం క‌ల్పించేలా రూపొందించిన‌వే అని చెప్పారు. అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత‌, వైఎస్సార్ ఆస‌రా, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, పేద‌లంర‌దికీ ఇళ్లు.. ఇలా అన్నీ ప‌థ‌కాలు, అన్ని సంక్షేమ కార్య‌క్ర‌మాలు మ‌హిళ‌ల‌కు నేరుగా ల‌బ్ధి క‌లిగించేలా రూపొందించిన‌వే అని చెప్పారు. ఇంత గొప్ప ప‌రిపాల‌న అందించిన ఘ‌న‌త ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి కే చెల్లింద‌ని వెల్ల‌డించారు. ఇవ‌న్నీ చూసే రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల మ‌హిళ‌లు పెద్ద ఎత్తున వైఎస్ జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్నార‌ని పేర్కొన్నారు.

Read More..

ఈవీఎంల ఫస్ట్ లెవెల్ చెకింగ్ లో జిల్లా ఎన్నికల అధికారి

Tags:    

Similar News