AP News : పెన్ను కోసం గొడవ.. విద్యార్థిని ఆత్మహత్య
ఏపీ(AP)లోని నరసరావుపేటలో దారుణ ఘటన జరిగింది.
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లోని గుంటూరు జిల్లా నరసరావుపేటలో దారుణ ఘటన జరిగింది. పెన్ను కోసం గొడవపడి ఓ విద్యార్థిని అతహత్య చేసుకుంది.నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ కాలేజ్ హాస్టల్లో ఉంటూ ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థినికి.. శనివారం ఉదయం పెన్ కోసం తోటి స్నేహితురాలితో గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని హాస్టల్ భవనం నాలుగవ అంతస్తుపై నుంచి కిందకు దూకింది. కాలేజ్ నిర్వాహకులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే మృతి చెందిందని వైద్యులు తేల్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.