Gudlavalleru: గుడ్లవల్లేరులో పరిస్థితి ఉద్రిక్తం.. కొనసాగుతోన్న విద్యార్థి సంఘాల ఆందోళన
గుడ్లవల్లేరులో హిడెన్ కెమెరాల వ్యవహారంలో విద్యార్థినులు చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చుతోంది.
దిశ, వెబ్డెస్క్: గుడ్లవల్లేరులో హిడెన్ కెమెరాల వ్యవహారంలో విద్యార్థినులు చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ మేరకు తమకు వెంటనే న్యాయం చేయాలంటూ గర్ల్స్ హాస్టల్ ఎదుట విద్యార్థినులు బైఠాయించగా.. వారికి విద్యార్థి సంఘాల నాయకులు సంఘీభావం తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు. అనంతరం వారు వాష్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ మొత్తం బాగోతంలో ఓ యువతి ప్రమేయం ఉందని.. ఆమె సీక్రెట్ కెమెరాలు పెట్టిందని ఆరోపించారు. ఈ క్రమంలో హాస్టల్లోకి దూసుకెళ్లేందుకు విద్యార్థి నేతల యత్నించగా ఆందోళనకారులను పోలీసులు అడ్డకున్నారు. దీంతో పోలీసులు, విద్యార్థి నేతల మధ్య తీవ్రం వాగ్వాదం కొనసాగుతోంది.