విద్యార్థులకు BIG షాక్.. భారీగా తగ్గనున్న సంక్రాంతి సెలవులు
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణలోని పాఠశాలలకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది
దిశ, ఫీచర్స్: రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణలోని పాఠశాలలకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. మిషనరీ స్కూళ్లకు తప్ప అన్ని స్కూళ్లకు హాలీడేస్ వర్తిస్తాయని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. కాగా జనవరి 12 న ఆప్షనల్ హాలీడే, 13, 2 శనివారం, 14 వ తారీకున భోగి, 15న సంక్రాంతి, 16న కనుమను ప్రజలు పండగను జరుపుకోనున్నారు. అయితే ఏపీలో క్యాలెండర్ ప్రకారం ఈ నెల (జనవరి) 9వ తారీకు నుంచి 18 వ వరకు పాఠశాలలకు సెలవులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో తుఫాను కారణంగా హాలీడేస్ ప్రకటించిన నేపథ్యంలో సంక్రాంతి సెలవులు తగ్గిస్తారని తెలుస్తోంది. కాగా సెలవులపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.