తేలికపాటి వర్షాలకే చిత్తడవుతున్న ప్రభుత్వ కార్యాలయాలు.. ఇబ్బందులు పడుతున్న ప్రజలు
ఆళ్లగడ్డ పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారని సీపీఐ (యం యల్) లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు గాలి రవిరాజ్ ఆరోపించారు.
దిశ ప్రతినిధి,నంద్యాల సిటీ: ఆళ్లగడ్డ పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారని సీపీఐ (యం యల్) లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు గాలి రవిరాజ్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆళ్లగడ్డ పట్టణంలో విద్యాశాఖ మండల ఆఫీస్, సబ్ రిజిస్టర్, ఇంజనీరింగ్, సచివాలయం కార్యాలయాలకు వెళ్లాలంటే బురదలో నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా కార్యాలయాలకే ఈ పరిస్థితి ఉంటే కాలనీలా పరిస్థితి ఎలా ఉంటుందో ఇట్లే తెలిసిపోతుందని ఆరోపించారు. నాయకులకు అధికారులకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న కార్యాలయాలకు సరైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.