Stampede Effect: శ్రీవారి దర్శన టోకెన్ల జారీపై ప్రభుత్వం కీలక నిర్ణయం
శ్రీవారి దర్శన టోకెన్ల జారీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది...
దిశ, వెబ్ డెస్క్: శ్రీవారి దర్శన టోకెన్ల(Srivari Darshan Tokens) కోసం తిరుపతి(Tirupati)లో జరిటిన తొక్కిసలాట(Stampede) ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో టీటీడీ(TTD) అధికారులతో సీఎం చంద్రబాబు(Cm Chandrababu) సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి దర్శనానికి టోకెన్ల జారీ విధానాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చిందని చంద్రబాబు గుర్తు చేశారు. తిరుపతిలో టికెట్లు ఇవ్వడం కరెక్ట్ కాదని ప్రతి ఒక్కరూ చెబుతున్నారన్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి 2 రోజులేనని, 10 రోజులు ఎందుకు చేశారో తెలియదని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.
ఆగమ శాస్త్రాలు దీన్ని అంగీకరిస్తాయో కూడా తెలియదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీవారు వెలిసినప్పటి నుంచి ఉన్న సంప్రదాయాలను ఉల్లంఘించడం కరెక్టేనా అని ప్రశ్నించారు. దీనిపై ఆగమ పండితులు త్వరగా నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. తిరుమల క్షేత్రం(Tirumala Temple) పవిత్రతను కాపాడటానికి మనస్ఫూర్తిగా పని చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. భవిష్యత్తులో తొక్కిసలాంటి ఘటనలు జరగకుండా కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పేనన్నారు. అనాలోచిత నిర్ణయాలతో శ్రీవారిని అప్రతష్టపాలు చేయొద్దని సూచించారు. వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకుంటే స్వర్గానికి వెళ్తామని భక్తులు నమ్మకమని చెప్పారు. ఎప్పుడూ లేని సంప్రదాయాన్ని జగన్ సర్కార్(JaganGovt) తీసుకొచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు.