విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక ప్రకటన

ఏపీలో విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం న్యూస్ తెలిపింది....

Update: 2024-10-29 12:40 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో విద్యుత్ వినియోగదారుల(Electricityconsumers)కు ప్రభుత్వం న్యూస్ తెలిపింది. విద్యుత్ చార్జీలు(Electricity charges) పెంచడంలేదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విద్యుత్ చార్జీలను పెంచబోతోందని ప్రచారం జరిగింది. దీంతో వినియోగదారులు ఆందోళన చెందారు. అయితే ఈ విషయంపై స్పందించిన మంత్రి గొట్టపాటి రవి(Minister Gottapati Ravi).. విద్యుత్ చార్జీల పెంపుపై స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచడం లేదని వెల్లడించారు. కేవలం విద్యుత్ సర్దుబాటు చార్జిలు మాత్రమే వసూలు చేస్తున్నామని తెలిపారు. విద్యుత్ చార్జీలు పెంచబోతున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని, అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు. దమ్ముంటే ప్రతిపక్షాలు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారారు. జగన్ హయాంలో ప్రజల ముక్కుపిండి విద్యుత్ చార్జీల వసూలు చేశారని విమర్శించారు. ఇప్పుడు విద్యుత్ చార్జి పెంపుపై మాట్లాడే హక్కు జగన్‌కు లేదన్నారు. గత టీడీపీ హయాంలో మిగులు విద్యుత్‌లో ఏపీ నెంబర్ వన్‌గా ఉండేదని, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వనాశనం అయిందని మంత్రి గొట్టిపాటి విమర్శించారు.


Similar News