AP:రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్.. మంత్రి సత్య కుమార్ కీలక నిర్ణయం
రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సర్కార్(AP Government) గుడ్ న్యూస్ చెప్పింది.
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సర్కార్(AP Government) గుడ్ న్యూస్ చెప్పింది. ఆరోగ్య శ్రీ కింద ప్రతి ఒక్కరికీ రూ.25 లక్షల వైద్య సాయం అందిస్తామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ(AP Medical Health Department) మంత్రి సత్య కుమార్(Minister Satya Kumar) తెలిపారు. ఈ క్రమంలో ఆయన నేడు(శుక్రవారం) కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం వైద్యారోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం పెట్టిన 2 వేల కోట్ల బకాయిలు మా ప్రభుత్వం తీర్చిందని మంత్రి తెలిపారు. అంతేకాదు వైసీపీ హయాంలో వైద్య రంగాన్ని విస్మరించిందని ఫైరయ్యారు. ‘గాడి తప్పిన వైద్య వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. వైద్య వ్యవస్థను పెట్టేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందుకుగానూ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.4 వేల కోట్లు ఖర్చు చేసేందుకు నిర్ణయించింది’ అని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.