అభ్యర్థులకు గుడ్‌న్యూస్: 6,100 కానిస్టేబుల్ పోస్టులపై బిగ్ అప్డేట్

ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త. వైసీపీ హయాంలో కోర్టు కేసులో నిలిచిపోయిన 6, 100 కానిస్టేబుల్ పోస్టుల నియామకంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

Update: 2024-08-27 05:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త. వైసీపీ హయాంలో కోర్టు కేసులో నిలిచిపోయిన 6, 100 కానిస్టేబుల్ పోస్టుల నియామకంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం ఈ పోస్టుల నియామక ప్రక్రియలో కదలిక వచ్చింది. న్యాయపరమైన సమస్యలు కొలిక్కి రావడంతో రెండు, మూడు రోజుల్లోనే ఫిజికల్ టెస్టుల షెడ్యూల్ వెలువడే చాన్స్ ఉంది. కాగా అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూసే ఈ ప్రక్రియ తొందరగా పూర్తి చేయడానికి ఆంధ్రప్రదేశ్ సర్కారు చర్యలు తీసుకుంటోంది. నోటిఫికేషన్ హోంగార్డులకు ఎఆర్, సివిల్ పోస్టుల్లో పదిహేను శాతం, ఎపీఎస్పీ పోస్టుల్లో 25 శాతం రిజర్వేషన్ ఇవ్వడంతో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.


Similar News