వల్లభనేని వంశీకి అస్వస్థత.. ర్యాలీ నిలిపివేత (వీడియో)
గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ..
దిశ, వెబ్ డెస్క్: గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నామినేషన్ వేసేందుకు గన్నవరంలో ఆయన ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ ర్యాలీలో ఆయన ఉక్కపోతకు గురయ్యారు. దీంతో శ్వాస తీసుకునేందుకు వంశీ స్వల్ప ఇబ్బందులు పడ్డారు. ర్యాలీని నిలిపివేసి ఓ చోట కూర్చుని అవస్తలు పడ్డారు. అనంతరం నేరుగా ప్రచార వాహనంలోనే ఆర్వో కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆర్వో కార్యాలయం వద్ద స్వల్పంగా ఇబ్బంది పడ్డారు. ఆర్వో కార్యాలయం ప్రాంగణంలో చెట్టు కింద కూర్చుని కొంత రెస్ట్ తీసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అయితే చంద్రబాబును ముసలోడు అంటూ వల్లభనేని వంశీ గతంలో చేసిన వ్యాఖ్యలకు తాజాగా టీడీపీ నాయకులు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ముసలోడు ఎవరనేది ఇప్పుడు తెలుస్తుందులేనని సెటైర్లు వేస్తున్నారు. డెబ్బై ఏళ్లు దాటినా చంద్రబాబు హుషారుగా ఎండలో తిరుగుతున్నారని, తమరు కొద్దిసేపు ఎండలో తిరిగితే అడ్డం పడుతున్నావ్ అంటూ విమర్శలు చేస్తున్నారు. కర్మ అనేది ఒకటి ఉంటుందని, వంశీకి డబుల్ డోస్ ఇస్తుందని, ఇది శాంపిల్ మాత్రమేనంటూ టీడీపీ శ్రేణులు ఎద్దవా చేస్తున్నారు.
వల్లభనేని వంశీ ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి!!
— Team Lokesh (@Srinu_LokeshIst) April 25, 2024
గన్నవరం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ బల ప్రదర్శన ర్యాలీకి అంతరాయం....
ఎండ తీవ్రతతో ఉక్కపోతకు గురైన వల్లభనేని వంశీ..
నేరుగా ప్రచార వాహనంలోనే ఆర్వో కార్యాలయానికి వెళ్లిన వల్లభనేని వంశీ..... pic.twitter.com/lG7EdRi19P
నిన్నే కదరా... ఆడు ముసలోడు, ఈడు ముసలోడు.. గట్టిగా అరిస్తే వాడి గుండె ఆగుతుంది అన్నావ్.. కర్మ అనేది ఒకటి ఉంటుంది... నీకు డబల్ డూస్ తిరిగి ఇస్తుంది.. ఇది సాంపుల్ మాత్రమే
— Achanta Raja (@achantaraja) April 25, 2024
"ఎండ తీవ్రతతో ఉక్కపోతకు గురైన వల్లభనేని వంశీ.. ఊపిరి అందక వంశీ స్వల్ప అస్వస్థత. ర్యాలీ మధ్యలో నిలిపివేత. " pic.twitter.com/3j3hECyKGM