Ganja Smugling: సినిమా స్టైల్లో స్మగ్లింగ్.. లారీ క్యాబిన్ లో గంజాయి తరలింపు

ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో గంజాయి స్మగ్లింగ్ ముఠాలు రెచ్చిపోతున్నాయి.

Update: 2024-08-31 11:35 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో గంజాయి స్మగ్లింగ్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఏపీ, తెలంగాణల మీదుగా ఇతర రాష్ట్రాలకు భారీ స్థాయిలో గంజాయి తరలిస్తున్నారు. గంజాయి తరలించేందుకు వీరు అనుసరిస్తున్న విధానాలు పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే పుష్ప సినిమా స్టైల్లో గంజాయి స్మిగ్లింగ్ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. శనివారం లారీలో గంజాయి తరలిస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లా పోలీసులకు సమాచారం అందింది. దీంతో హుటాహుటిన బయలుదేరి వెళ్లిన పోలీసులు లారీని అడ్డగించారు. లారీలో ఎక్కడ చూసినా గంజాయి లేదని ఖాళీగా ఉన్న లారీని చూసి తప్పుడు సమాచారం అనుకున్నారు.

ఇంతలో ఓ పోలీసు అధికారి లారీ క్యాబిన్ పైకి ఎక్కి చూడగా.. విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులు అచ్చం సినిమాల్లో లాగా స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. లారీ క్యాబిన్ పైన ఓ బాక్స్ ఏర్పాటు చేసి, దానిని రేకుతో కప్పి సీల్ చేసి అందులో భారీగా గంజాయి తరలిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. గంజాయి తరలించేందుకు నిందితులు చేసిన సెటప్ చూసిన పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. లారీని సీజ్ చేశారు. లారీలో గంజాయి తరలిస్తున్న నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.


Similar News