Heavy Rains:భారీ వర్షాలు..మునిగిన గండిపోచమ్మ ఆలయం

ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.

Update: 2024-07-21 11:15 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఏకధాటిక కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. భారీగా వరద నీరు పోటెత్తడంతో రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులు నిండుకుండలా మారుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం 10.2 అడుగులకు చేరింది. దీంతో ధవళేశ్వరం నుంచి డెల్టా కాలువకు 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవీపట్నం మండలం గండి పోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఉధృతంగా గోదావరి నీటిమట్టం పెరిగిపోతుంది. దీంతో గండి పోచమ్మ అమ్మవారి ఆలయం పూర్తిగా నీటమునిగింది. ఇది ఇలా ఉంటే గోదావరి వరద ఉధృతి వల్ల జాతీయ రహదారి 326 కోతకు గురవ్వడంతో ఒడిశా-ఆంధ్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

Tags:    

Similar News