పవన్‌‌ను ఓడించేందుకు వైసీపీ బిగ్ స్కెచ్.. రంగంలోకి ఆమె..!

విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్ధిగా విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంటక కుమారి పేరు దాదాపుగా ఖరారైంది..

Update: 2024-01-29 14:11 GMT

దిశ, విశాఖపట్నం ప్రతినిధి: విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్ధిగా విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంటక కుమారి పేరు దాదాపుగా ఖరారైంది. గత ఎన్నికల్లో ఈ నియోజక వర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఓడించి వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన తిప్పల నాగిరెడ్డి విజయం సాధించారు. అయితే ఈ పర్యాయం ఆయనకు టికెట్ నిరాకరించిన అధిష్టానం యాదవ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్ ఉరికూటి రామచంద్రరావును నియమించింది.


అయితే ఆ నియామకం పట్ల శాసనసభ్యుడు నాగిరెడ్డి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రామచంద్రరావుకు తాము సహకరించేది లేదంటూ నాగిరెడ్డి అడ్డం తిరగడంతో అధిష్టానం మరో మార్గం లేక అదే సామాజిక వర్గానికి చెందిన మేయర్ హరి వెంటక కుమారి అభ్యర్ధిత్వానికి మొగ్గు చూపింది. గాజువాకకు చెందిన చినతల్లి పేరును నాగిరెడ్డి వర్గం ప్రతిపాదించినప్పటికీ అధిష్టానం అంగీకరించలేదని తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో వెలువడనున్న ఐదవ జాబితాలో మేయర్ పేరు ప్రకటించనున్నారని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి...

Tags:    

Similar News