TTD Former Chairman: దేవుడే సుప్రీంకోర్టుతో ఆ మాటలు పలికించాడు..
తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు(Supreme Court) సరైన విధంగా ప్రశ్నించిందని టీటీడీ(TTD) మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana Karunakar Reddy) అన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు(Supreme Court) సరైన విధంగా ప్రశ్నించిందని టీటీడీ(TTD) మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana Karunakar Reddy) అన్నారు. సోమవారం భూమన సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించారు. దేవుడే కోర్టుతో ఆ మాటలు పలికించాడని తెలిపారు. కొంత ఆలస్యమైనా చివరకు నిజమే గెలుస్తుందని వెల్లడించారు. ఏ తప్పూ చేయలేదు కాబట్టే తాము విచారణ చేయాలని కోరినట్లు గుర్తుచేశారు. స్వామివారి వైభవాన్ని తగ్గించేలా సీఎం చంద్రబాబు(Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కాగా, తిరుమల లడ్డూ వివాదంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఘటనపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. తిరుమల లడ్డూ వ్యవహారంలో నిజానిజాలు తెలుసుకోకుండా సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారో లేదో తెలుసుకోకుండా ప్రకటన ఎలా చేస్తారంటూ ప్రశ్నించింది. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.