AP Politics: టీడీపీకి భారీ షాక్.. పార్టీని వీడిన మాజీ మంత్రి.. కారణం అదేనా..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి.
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీ టికెట్ దక్కని నేతలు ఆ పార్టీని వేడిని వేరొక పార్టీలోకి జంప్ అవుతున్నారు. తాజాగా టీడీపీ మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారని సమాచారం. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆయన టీడీపీ తరుపున కర్నూల్ పార్టీ టికెట్ ఆశించారు.
అయితే టీడీపీ మాత్రం ప్రభాకర్ కి టికెట్ ఇవ్వలేదు. దీనితో మనస్తాపానికి గురైన ప్రభాకర్ పక్కచూపులు చూస్తూ.. వైసీపీ వైపు అడుగులేస్తున్నారని రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొడుకు రుద్ర ఒత్తిడి మేరకు ప్రభాకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసేందుకు ప్రభాకర్ యోచిస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.